తెలంగాణ

telangana

ETV Bharat / state

Protest Against Chandrababu in Telangana : చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో ఆందోళనలు.. నల్లబ్యాడ్జీలతో టీడీపీ నేతల నిరసనలు

Protest Against Chandrababu Naidu in Telangana : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్​ను నిరసిస్తూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. బాబుపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

chandhrababu arrest
Chandrababu

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 2:51 PM IST

Protest Against Chandrababu Naidu in Telangana : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు మాజీ ముఖ్యమంత్రి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

TDP Rally Against Chandrababu Arrest in Telangana : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ కూకట్ పల్లిలోని ప్రగతినగర్​లో చంద్రబాబు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. మిథిలానగర్ నుంచి అంబీర్ చెరువు వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నందమూరి చైతన్య కృష్ణ ర్యాలీలో పాల్గొని.. నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో అరాచక పాలన అంతం కావాలని విమర్శించారు. మరోవైపు ఉప్పల్‌లో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నాయకులు తార్నాకలో మౌన దీక్షను చేపట్టి నిరసనను వ్యక్తం చేశారు. మౌన దీక్షకు టీడీపీ కార్యకర్తలు, బాబు అభిమానులుభారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు.

TDP angry over Siemens private company appraisal report కేంద్ర సంస్థ నివేదికను పక్కన పెట్టి.. ప్రైవేట్ సంస్థతో మదింపు చేసి.. కేసులో ఇరికించారు: టీడీపీ

Special Medical Team for Chandrababu in Jail: రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు..

"టీడీపీ అధినేత ఒక విజినరీ ఉన్న లీడర్​. అతన్ని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశంలో ఉన్న తెలుగు ప్రజలంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి వారి నిరసనలు తెలుపుతున్నారు. లోకేష్​ యువగళం పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని.. నెమ్మదిగా ఏపీలో చంద్రబాబుకు పూర్వవైభవం వస్తోందని జగన్ ఈ కుట్ర పన్నారు. బాబును ఎక్కడికి పంపించినా ఆంధ్రాలో భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది." - టీడీపీ కార్యకర్తలు

Agitation Against Chandrababu Arrest :చంద్రబాబు అక్రమ రిమాండ్‌ను నిరసిస్తూ ఖమ్మంలో నిరసనలు కోనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు బెయిల్ పై బయటికి క్షేమంగా రావాలని హనుమకొండ జిల్లా పరకాలలో శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్​ను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడలో అఖిల పక్షం నాయకులు భారీ నిరసన ర్యాలీ ప్రదర్శించారు. బాబుపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

TDP Leader Pattabhi Ram on Siemens Project: సిద్ధం చేసుకున్న అబద్ధాలతో చంద్రబాబును దోషిగా చూపిస్తున్నారు : టీడీపీ నేత పట్టాభి

Arja Srikanth on Siemens Project కళ్లు మూసుకుంటే.. నిజాలు ఎలా తెలుస్తాయి! ప్రాజెక్టు పనితీరు భేష్ అంటూ రాసిన లేఖ సంగతేంటీ?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details