మెట్రో రెండో దశ పనుల కోసం దిల్లీ మెట్రో అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారని మెట్రో ఎండీ ఎస్వీఎన్ రెడ్డి వెల్లడించారు. రెండో దశ నిర్మాణం విమానాశ్రయం వరకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
'మెట్రో' విస్తరణ: ఈ సారి ఎక్కడి నుంచి ఎక్కడికంటే? - రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో మార్గం
మెట్రో రెండో దశ పనుల కోసం దిల్లీ మెట్రో అధికారులు డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ దశలో విమానాశ్రయం వరకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి 31 కిలోమీటర్లు, లక్డీకాపూల్ నుంచి విమానాశ్రయానికి నూతన మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు సైతం మెట్రోను విస్తరించాలనే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు. పాతబస్తీలో ఐదు కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 16 కోట్ల మంది ప్రయాణించారని వివరించారు.
ఇవీ చూడండి:'ఇళ్లు కేటాయించే వరకు ప్రభుత్వమే కిరాయి చెల్లించాలి'