తెలంగాణ

telangana

ETV Bharat / state

మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి : నేతన్నల జాతీయ జేఏసీ - జాతీయ చేనేత దినోత్సవం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపిన చేనేత ఐక్యకార్యాచరణ కమిటీ... తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. 2 ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, 5 లక్షల ఇన్సూరెన్స్, ప్రత్యేక ఆరోగ్య కార్డులు ఉచితంగా అందిచడం, రూ.36 వేల పెట్టుబడి సాయం, కరోనా వల్ల పేరుకుపోయిన చేనేత నిల్వలను కొనడం, ఏడాది పొడవునా పని కల్పించడం వంటివి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి : నేతన్నల జాతీయ జేఏసీ
మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి : నేతన్నల జాతీయ జేఏసీ

By

Published : Aug 7, 2020, 6:44 PM IST

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ జాతీయ ఛైర్మన్ దాస్ సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. 1905 ఆగస్ట్ 7న కలకత్తా టౌన్​హాల్​లో జరిగిన "విదేశీ వస్త్రాదహనం- స్వదేశీ వస్తు స్వావలంబన" అనే మహత్తర ఘట్టానికి ప్రతీక అని నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ జాతీయ ఛైర్మన్ దాస్ సురేష్ గుర్తు చేశారు.

మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు...

అంతటి ఘనకీర్తి గల చేనేతను ఆదుకోవాల్సిన పాలకులు ప్రస్తుతం నేతన్నను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ పోరాటంలో చెరగని ముద్రను వేసిన చేనేత నేడు తీవ్ర సంక్షోభంలో ఉందని వాపోయారు.

ఆ హామీలను వెంటనే నెరవేర్చాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి సమీకృత చేనేత విధానాలు రూపొందించితే తప్ప చేనేత మనుగడ సాధ్యం కాదన్నారు. చేనేతలకు ప్రభుత్వ హామీ ప్రకారం రెండు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, 5 లక్షల ఇన్సూరెన్స్, ప్రత్యేక ఆరోగ్య కార్డులు ఉచితంగా అందిచడం, ఒక్కో నేతన్నకు రూ.36 వేల పెట్టుబడి సాయం, కరోనా వల్ల పేరుకుపోయిన చేనేత నిల్వలను కొనడం, ఏడాది పొడవునా పని కల్పించడం వంటివి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకోవాలని స్పష్టం చేశారు. అప్పుడే చేనేత వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందన్నారు. చేనేతను ఉదరిద్దాం -నేతన్నను కాపాడుకుందామన్నారు.

ఇవీ చూడండి : పుషప్‌లు చేస్తూ 81వ పుట్టినరోజు చేసుకున్న బామ్మ!

ABOUT THE AUTHOR

...view details