భూ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పాత్రికేయులు రఘు(journalist raghu) అక్రమ అరెస్ట్‌ను తెలంగాణ జన సమతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం(kodandaram) తీవ్రంగా ఖండించారు. రఘుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రఘు ఒక విలేకరిగా నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే.. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడంతోపాటు అదనంగా రోజుకో కేసు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
kodandaram: 'జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలి' - Telangana news
పాత్రికేయులు రఘుపై(journalist raghu) పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జన సమతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం(kodandaram) డిమాండ్ చేశారు. భూ అక్రమాలను వెలుగులోకి తెస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది మానవ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
kodandaram: 'జర్నలిస్టు రఘను వెంటనే విడుదల చేయాలి'
ఇది పూర్తిగా మానవ ఉల్లంఘనే అవుతుందన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై(eatala rajender) ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే మంత్రి పదవి నుంచి తొలగించారని… దీంతో ప్రభుత్వం ఎంతో నీతిమయం అనుకుంటే పోరపాటు అని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా నిబంధనల పేరుతో రఘును కలువకుండా చేయడం అన్యాయమని అన్నారు. తన విధిని తాను చేశాడు తప్ప... గొడవలు, దాడి చేయలేదన్నారు.
ఇదీ చూడండి:Father, Daughter dead: తండ్రి, కూతుర్ని నీట ముంచిన మృత్యువు
Last Updated : Jun 9, 2021, 9:51 PM IST