తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ యూనివర్సిటీలు రాబోతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాన్ని అమల్లోకి తెస్తూ... జీవో జారీ అయింది. గతేడాది మార్చి 28న చట్టసభల ఆమోదం పొందినప్పటికీ... ప్రభుత్వం 16 నెలల తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు, విధివిధానాలపై తుది కసరత్తు జరుగుతోంది. మరో వారంలో వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది.
ప్రముఖ సంస్థల ఆసక్తి..
దేశంలో ఇప్పటి వరకు 24 రాష్ట్రాల్లో 334 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం రిలయన్స్, అదానీ వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు 2016 నుంచి కసరత్తు జరుగుతోంది. ప్రైవేట్ విశ్వవిద్యాయాల చట్టం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ప్రకటించారు. ఉన్నత విద్యామండలి 2017లో బిల్లు ముసాయిదా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ముసాయిదాపై చర్చించింది. చివరకు 2018 మార్చి 28న చట్ట సభల ఆమోదం పొందింది.
భిన్నాభిప్రాయాలు..