తెలంగాణ

telangana

ఇవాళ భారత్ బయోటెక్​ను సందర్శించనున్న ప్రధానమంత్రి

By

Published : Nov 28, 2020, 5:20 AM IST

Updated : Nov 28, 2020, 7:29 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్​కు రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ పురోగతిని పరిశీలించటంతో పాటు శాస్త్రవేత్తలతో చర్చించనున్నారు.

prime minister narendra modi will come to Hyderabad today
ఇవాళ హైదరాబాద్​ రానున్న ప్రధాన మంత్రి మోదీ

భారత్​ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ పురోగతిని పరిశీలించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్​కు రానున్నారు. హకీంపేట వైమానిక స్థావరానికి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం సుమారు 12.55కి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి నగరశివార్లలోని జినోమ్‌వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ సంస్థకు వెళ్తారు.

కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని ప్రధాని మోదీ పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్‌ బయోటెక్‌ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. అక్కడాయన సుమారు గంటసేపు గడుపుతారు.

ప్రధాని మోదీ షెడ్యూలు

  • మధ్యాహ్నం 12.55కు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని మోదీ
  • 1 గంటకు రోడ్డు మార్గం ద్వారా భారత్ బయోటెక్​కు పయనం
  • 1.25కు భారత్ బయోటెక్ చేరుకోనున్న ప్రధాని
  • 1.25 నుంచి 2.10 వరకు భారత్ బయోటెక్ సందర్శన
  • 2.15 కు భారత్ బయోటెక్ నుంచి హకీంపేట విమానాశ్రయానికి తిరుగు పయనం
  • 2.40 హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని
  • 3.50 హకీంపేట నుంచి పుణె బయల్దేరనున్న మోదీ

ఇదీ చదవండి:'డిప్యూటీ స్పీకర్ సాబ్.. కాంగ్రెస్​కు మీ ఓటేయండి.!'

Last Updated : Nov 28, 2020, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details