President Droupathi Murmu Will Visit Yadadri: రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 29న రానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఖరారైనందున రాష్ట్ర ప్రభుత్వం తగు ఏర్పాట్లపై యోచిస్తోంది. పూర్వం ఈ క్షేత్రాన్ని నలుగురు రాష్ట్రపతులు సందర్శించారు. ప్రస్తుతం ఈమె రాకతో ఈ క్షేత్రానికి వచ్చిన 5వ రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు.
ఈనెలలో.. యాదాద్రి క్షేత్రానికి రాష్ట్రపతి రాక! - ఈనెల 29న యాదాద్రికి రానున్న ద్రౌపతి ముర్ము
President Droupathi Murmu Will Visit Yadadri: యాదాద్రి లక్ష్మీనరహింహ స్మామి వారి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈనెల 29న రానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఖరారైనందున తెలంగాణ ప్రభుత్వం తగు ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. పూర్వంలో ఈ క్షేత్రాన్ని నలుగురు రాష్ట్రపతులు సందర్శించారు. ముర్ము రాక కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, ఏర్పాట్లను ముమ్మరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.
ముర్ము కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ... ఏర్పాట్లను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. రాష్ట్రపతి రాకతో యాదాద్రి పుణ్యక్షేత్రం విశిష్టత, ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తింపజేస్తుందని యాదాద్రి దేవాలయాభివృద్ది వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు. మెుదటి, రెండవ రాష్ట్రపతులు స్వర్గీయ డా.రాజేంద్రప్రసాద్, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.శంకర్ దయాల్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ సందర్శించి ఈ క్షేత్ర ఖ్యాతిని మరింత పెంచారు.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఈ క్షేత్రాభివృద్ధి పనులకు ముందస్తుగా 2015 జులై 5న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విస్తరణకు పూర్వం నాటి పంచనారసింహుల ఆలయాన్ని సందర్శించి దైవదర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ క్షేత్రాభివృద్ధి గూర్చి వివరించి, రూపొందనున్న దేవాలయం నమూనాలు చూపించి, కితాబు పొందారు.