తెలంగాణ

telangana

ETV Bharat / state

సూపర్‌ మార్కెట్​కు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి! - CORONA PRECAUTIONS

నగరాలు, పట్టణాలలో నిత్యావసరాల కోసం సూపర్‌ మార్కెట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కువ మంది ఇక్కడే వంటసామగ్రి, ఇతర వస్తువుల కొనుగోలుకు వస్తుంటారు. కరోనా నేపథ్యంలో వీటిల్లో అన్నివిధాలా జాగ్రత్త చర్యలు చేపట్టారు. మన వంతుగానూ పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

PRECAUTIONS FOR SUPERMARKET CUSTOMERS TO ERADICATE CORONA VIRUS
సూపర్‌ మార్కెట్​కు వెళ్తున్నారా... ఈ జాత్రత్తలు పాటించాల్సిందే!

By

Published : Apr 15, 2020, 12:56 PM IST

* ఇంటి బయటకు వెళ్తున్నారంటే తొలుత మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఏ మాత్రం నలతగా ఉన్నా మార్కెట్‌కు వెళ్లే ఆలోచన మానుకోండి. మీ స్నేహితులనో, ఇరుగుపొరుగు వారినో తెచ్చివ్వమని కోరండి.

* ఒక్కరే వెళ్లాలన్న విషయం మరవొద్దు. ముందుగా ఏమేం సరకులు అత్యవసరమో జాబితా రాయాలి. అనవసరంగా ఒక్కటీ ఎక్కువ రాయవద్దు.

* ముందుగా ఉప్పు పప్పులు, చక్కెర వంటి కిరాణా సరకులు తీసుకోవాలి. తర్వాత పాలు, పాల పదార్థాలు.. చివరిగా కోడిగుడ్లు, మాంసం, చేపలు తీసుకోవాలి.

* ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోండి. వీలుంటే శానిటైజర్‌, వైప్స్‌ దగ్గర ఉంచుకోండి.
* అన్నింటికంటే ముఖ్యంగా భౌతిక దూరం పాటించాలి. ఇతరులకు ఆరు అడుగుల దూరంలో ఉండాలి.

* చూసిన వాటినల్లా ముట్టుకోవద్దు. మీరేం కొంటున్నారో వాటినే తీసుకోండి. పండ్లు, కూరగాయల విషయంలో ఏరి చూడకుండా చూసి తీసుకోవడం ఉత్తమం.

* సూపర్‌బజార్‌లో ముఖాన్ని అసలు తాకొద్దు. ఆడవాళ్లు జుట్టు ముఖంపై పడకుండా ముడి వేసుకోవాలి.

* బిల్లింగ్‌ వద్ద స్పర్శకు తావు లేని పద్ధతుల్ని ఎంచుకోండి. కాంటాక్ట్‌లెస్‌ కార్డులు, గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం వంటివి ఉన్నాయిగా.

* ఇంటికి రాగానే ముందుగా చేతులు సబ్బుతో 20-30 సెకన్ల పాటు కడుక్కోండి. తర్వాత పండ్లు, కూరగాయల్ని బాగా కడిగాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. కడిగే ముందు బేకింగ్‌ సోడా వేసిన నీటిలో ఓ పావుగంట ఉంచితే మేలు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details