Prebid meetings: జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు జరగనున్నాయి. 8 జిల్లాల పరిధిలో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను విక్రయించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. మహబూబ్‌నగర్, నల్గొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని ప్లాట్లు వేలం వేయనున్నారు.
Prebid meetings: జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు - land sale in districts
Prebid meetings: జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు జరగనున్నాయి. 8 జిల్లాల పరిధిలో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను వచ్చే నెల 14 నుంచి 17 వరకు భౌతిక వేలం పద్ధతిలో విక్రయించనున్నారు.
8 జిల్లాల పరిధిలో వివిధ పరిమాణంలోని 1,092 ఓపెన్ ప్లాట్లను భౌతిక వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నేడు ప్రీబిడ్ సమావేశాలు జరగనున్నాయి. నల్గొండ, పెద్దపల్లి కలెక్టరేట్లు, గద్వాల, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జడ్పీ హాళ్లలో ప్రీబిడ్ సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డిలోని గెలాక్సీ గార్డెన్, కాగజ్‌నగర్‌లోని వంజిరి రైతు వేదిక, తాండూరు ఆర్డీవో కార్యాలయాల్లో ప్రీబిడ్ సమావేశాలు జరుగుతాయి. వచ్చే నెల 14 నుంచి 17 వరకు భౌతిక వేలం పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తారు.
ఇదీ చూడండి: Land Sales: మరో విడత భూముల అమ్మకానికి సిద్ధమవుతోన్న సర్కార్