Praja Palana in Telangana :రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల్లో ఉచిత కరెంట్‌కు ఎరక్కపోయి దరఖాస్తు చేసుకుని ఇరుక్కుపోయినట్లు ఉంది కొందరి పరిస్థితి. ఉచితం కావాలంటే ముందు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. చార్మినార్ జోన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతకాలంగా బిల్లులు చెల్లింపు జరగడంలేదు. ప్రజాపాలన అర్జీలతోపాటు జత చేసిన విద్యుత్ బిల్లులతో ఐదేళ్లుగా బకాయి చెల్లించని కుటుంబాలు చాలా ఉన్నాయని తేలింది.
Free Electricity Scheme in Telangana :ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందిస్తామని ఇప్పటికే ప్రకటించిందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించని వారందరికీ ఉచిత హామీని వర్తింపజేయాలంటే బకాయిలు (Pending Electricity Bills) అడ్డొస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులు వాటిని చెల్లించాలి లేదా ప్రభుత్వం బకాయిలను మాఫీ చేయాలని వివరించారు. రెండు మార్గాలూ తమకు ఆమోదయోగ్యమేనని, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఎల్‌టీ వినియోగదారుల బకాయిలు రూ.362 కోట్ల మేర పేరుకుపోయాయి. వీటిలో రాజేంద్రనగర్, చార్మినార్ సర్కిళ్ల బకాయిలే రూ.200 కోట్ల మేర ఉండటం గమనార్హం.
గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క
ప్రభుత్వ సంస్థలు సైతం :మరోవైపు ప్రభుత్వ శాఖలు చాలా కాలంగా బిల్లులు చెల్లించట్లేదు. ఒక్క జలమండలే రూ.3,100కోట్ల బకాయి పడింది. పురపాలక, విద్య తదితర శాఖల భవనాలూ చెల్లించట్లేదు. ఆ బకాయిలన్నీ వసూలైతే విద్యుత్‌శాఖ ఖజానాకు రూ.6,000ల కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుంది.
సర్కిళ్ల వారీగా బకాయిలు | కోట్లలో |
బంజారాహిల్స్ | రూ.10 కోట్లు |
సికింద్రాబాద్ | రూ.10 కోట్లు |
మేడ్చల్ | రూ.20 కోట్లు |
హబ్సిగూడ | రూ.29 కోట్లు |
సరూర్‌నగర్ | రూ.32 కోట్లు |
సైబర్‌సిటీ | రూ.36 కోట్లు |
హైదరాబాద్ సెంట్రల్ | రూ.38 కోట్లు |
రాజేంద్రనగర్ | రూ.84 కోట్లు |
హైదరాబాద్ సౌత్ | రూ.103 కోట్లు |