తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్ బెయిల్ రద్దుచేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు చేయట్లేదని రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐకి చివరి అవకాశాన్ని సీబీఐ కోర్టు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్​ 1వ తేదీకి వాయిదా వేసింది.

postponement-of-hearing-on-cm-jagan-bail-case
జగన్ బెయిల్ రద్దుచేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

By

Published : May 26, 2021, 1:24 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు గడువును మరోసారి సీఎం జగన్​తోపాటు సీబీఐ కోరింది. లాక్‌డౌన్‌తో కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని.. జగన్ తరఫు న్యాయవాది సీబీఐ కోర్టుకు తెలిపారు. మెయిల్ ద్వారా కౌంటర్‌ను సమర్పించవచ్చని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేష్ వాదనలు వినిపించారు.

ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గడువు పెంచవద్దని, జరిమానా విధించాలని కోరారు. సీబీఐ ఎందుకు కౌంటర్ వేయట్లేదో అర్థం కావట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐకి చివరి అవకాశాన్ని కోర్టు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్‌ 1కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:కమలనాథుల వరుసమంతనాలు.. స్వతంత్ర పోటీకే ఈటల​ మొగ్గు..!

ABOUT THE AUTHOR

...view details