Weather Report: రాయలసీమ ప్రాంతంపై 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు - ts weather
Weather Report: తెలంగాణలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంపై 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉందని ప్రకటించింది.
బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు... రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2, బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్‌లో 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో గత ఫిబ్రవరి తరవాత 24 గంటల వ్యవధిలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడం ఇదే తొలిసారి. శనివారం కౌటాల(కుమురం భీం జిల్లా)లో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.
ఇవీ చదవండి:
Last Updated : May 22, 2022, 9:21 AM IST