తెలంగాణ

telangana

ETV Bharat / state

జైళ్లలో ఉన్న ప్రవాసీయులను స్వదేశానికి తీసుకురండి: పొన్నం

గల్ఫ్‌ దేశాల జైళ్లలో మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన యువతను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌... రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోంశాఖ, విదేశాంగ శాఖ మంత్రులకు లేఖలు రాశారు. జైళ్లలో యువత ఉన్న వీడియోలను జత చేస్తూ లేఖలు రాసినట్లు పొన్నం వివరించారు.

జైళ్లలో ఉన్న ప్రవాసీయులను స్వదేశానికి తీసుకురండి: పొన్నం
జైళ్లలో ఉన్న ప్రవాసీయులను స్వదేశానికి తీసుకురండి: పొన్నం

By

Published : Sep 16, 2020, 11:39 PM IST

గల్ఫ్‌ దేశాల జైళ్లల్లో మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన యువతను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోంశాఖ, విదేశాంగ శాఖ మంత్రులకు లేఖలు రాశారు. గడిచిన నాలుగు నెలలుగా జైళ్లలోనే ఉన్నారని.. భారత్‌ మినహా ఇతర దేశాలకు చెందిన వారిని ఆయా దేశాలు విడిపించుకుపోతున్నాయని పేర్కొన్నారు.

ప్రవాస భారతీయులు తెలిపిన వివరాల మేరకు జైళ్లలో యువత ఉన్న వీడియోలను జత చేస్తూ లేఖలు రాసినట్లు పొన్నం వివరించారు. తక్షణమే ఈ విషయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చిన్న చిన్న కారణాలతో వారు జైళ్ల పాలయ్యారని.. నాలుగు నెలలు గడిచినా వారిని విడుదల చేయకపోవడం వల్ల జైళ్లల్లోనే మగ్గిపోతున్నారని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ యువత తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నందున కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్‌ ఎక్కడున్నా... ఆరోగ్యంగా ఉండాలి : పొన్నం ప్రభాకర్

ABOUT THE AUTHOR

...view details