నాగులు మృతి ప్రభుత్వ హత్యేనని మాజీ ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న నాగులు 3 రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా నాగులు మృతి పట్ల పొన్నం విచారం వ్యక్తం చేశారు.
నాగులుది ప్రభుత్వ హత్యే: పొన్నం ప్రభాకర్ - నాగులు మృతి తాజా వార్తలు
నాగులు మృతి పట్ల మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. నాగులుది ప్రభుత్వ హత్యేనంటూ ధ్వజమెత్తారు.
నాగులుది ప్రభుత్వ హత్యే: పొన్నం ప్రభాకర్
తెలంగాణ వచ్చినా.. ప్రజలకు ఏం లాభం జరగలేదని నాగులు వాపోయారని పొన్నం గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఫలితాలు.. ఒక్క కుటుంబానికే దక్కుతున్నాయని విమర్శించారు. నాగులు ఆవేదనే నేటి తెలంగాణ యువత ఆవేదనగా ఆయన వివరించారు.
ఇదీచూడండి.. ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి