రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆదివారం ఇద్దరు కరోనా రోగులు చికిత్స అందక మరణించారని... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించడం లేదంటూ ఒక వ్యక్తి... తన కుటుంబీకులకు వీడియో ద్వారా తెలియజేసి ఆ తర్వాత మరణించారని పేర్కొన్నారు.
కరోనా బాధితుల మరణాలపై మానవ హక్కుల సంఘానికి పొన్నం ఫిర్యాదు - మానవ హక్కుల సంఘం
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సరైన చికిత్స అందక ఇద్దరు కరోనా బాధితులు చనిపోయారని రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ప్రజలకు సరైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
కరోనా బాధితుల మరణాలపై మానవ హక్కుల సంఘానికి పొన్నం ఫిర్యాదు
ఎనిమిది నెలల బాలుడు కూడా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టాలని... ప్రజలకు సరైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌కు పొన్నం లేఖ రాశారు.
ఇవీ చూడండి: ఉద్యోగినిపై అధికారి దాడి.. నిందితునిపై నిర్భయ కేసు