కేసీఆర్ దోపిడి వెలుగులోకి వస్తుందని గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అందుకు పోలీసుల సహాయంతో వెళ్లనీకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేశారని తెలిపారు. తానూ రాజకీయ ఆరోపణలు చేయడం లేదని... రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులని కేసీఆర్ వైఖరి కారణంగానే మరొక ఉద్యమం వస్తుందని పొన్నాల అన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో తెలంగాణ రాష్ట్రంలో 38 ప్రాజెక్టులకు లక్షా తొమ్మిది వేల 791 కోట్లు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే ఆంధ్ర, రాయలసీమల్లో ప్రాజెక్టుల నిర్మాణాలకు చెంది కేవలం రూ.80,806 కోట్ల రూపాయల విలువ పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.