రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టుల కోసం రూ. 97,300 కోట్లు నీటిపారుదల శాఖ మీద ఖర్చు చేసినా... ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Laxmaiah) ఆరోపించారు. కాళేశ్వరం... కమీషన్ల ప్రాజెక్టుగా మారిందని విమర్శించారు. ఆర్డీఎస్ గురించి చాలా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)... ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటుంటే ఏపీతో చీకటి దోస్తానా... చేస్తారా అని పొన్నాల నిలదీశారు. ఎస్సారెస్పీ నుంచి సాగర్ వరకు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన అన్ని పాత ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని నీటిపారుదల శాఖ ప్రకటించిందన్నారు. కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులను ప్రారంభించారని వీటికి రూ. 97,300 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు.