తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యక్తిగత అజెండాలు ఎక్కువయ్యాయి

రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీలో అస్తవ్యస్తత నెలకొంది. ఓ వైపు శాసనసభ్యులు వరుసపెట్టి పార్టీ వీడుతుండగా... మరోవైపు కార్యకర్తలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నాయకత్వ వైఫల్యమే అని అభిప్రాయపడుతున్నారు ఆ పార్టీ నేతలు.

ఆత్మపరిశీలన చేసుకోవాలి..!

By

Published : Mar 14, 2019, 8:49 PM IST

ఆత్మపరిశీలన చేసుకోవాలి..!
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన పొంగులేటి... వ్యక్తిగత అజెండాల వల్ల పార్టీ నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

నాయకత్వ వైఫల్యం...
పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడంలో పార్టీ నాయకత్వం వైఫల్యం చెందిందని సుధాకర్​రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూడడంలో రాష్ట్ర సమష్టి నాయకత్వం విఫలమైందన్నారు. ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ మేల్కొనకపోతే... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details