సినీ ప్రముఖరాలు విజయ నిర్మల మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణంతో చిత్రపరిశ్రమ ప్రముఖ దర్శకురాలు, మంచి నటిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు... విజయనిర్మల మృతిపై స్పందించారు. సంతాపం తెలిపి... ఆమె సేవలను కొనియాడారు.
విజయనిర్మల మృతిపట్ల రాజకీయ నేతల సంతాపం - producer
ప్రముఖనటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతికి చేకూరాలని కోరుకున్నారు.
రాజకీయ నాయకుల సంతాపం