తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్ఖానాలోని క్యాంపు కార్యాలయానికి సాయన్న భౌతికకాయం.. పలువురి సంతాపం - MLA sayanna death

political leaders condolences to MLA sayanna: కంటోన్మెంట్‌ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

సాయన్న
సాయన్న

By

Published : Feb 20, 2023, 12:01 PM IST

political leaders condolences to MLA sayanna: అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయన్ని కుటుంబసభ్యులు తమ నివాసం నుంచి కార్ఖానాలోని క్యాంపు కార్యాలయానికి తరలించారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం మారేడుపల్లిలోని శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేయనున్నారు.

సాయన్న మృదుస్వభావి:ఎమ్మెల్యే సాయన్న మృదు స్వభావి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అశోక్ నగర్​లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా అందరితో సాయన్న కలియతిరిగి స్నేహపూర్వకంగా వ్యవహరించే వారని ఆయన గుర్తు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కిషన్​రెడ్డితో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, నిరంజన్ రెడ్డి, తలసాని, కొప్పుల ఈశ్వర్, దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఉపసభాపతి బండా ప్రకాశ్‌ తదితరులు సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. సాయన్న భౌతికకాయాన్ని మేయర్‌ విజయలక్ష్మి సందర్శించి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.

రాజకీయ జీవితం:తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సాయన్న 1983లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరారు. 1994 ఎన్నికల్లో కంటోన్మెంట్‌ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. వరుసగా 1999, 2004 ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. 2009లో ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి టీఆర్​ఎస్​ అభ్యర్థిపై గెలిచారు. ఆంధ్రప్రదేశ్​లోని చంద్రబాబునాయుడి టీడీపీ ప్రభుత్వం ఆయనకు తితిదే బోర్డు సభ్యుడి పదవి ఇచ్చింది. కొంతకాలానికే సాయన్న కేసీఆర్‌ సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details