మహంకాళి ఏసీపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదయ్యనగర్లో 80మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 100కు పైగా ఇళ్లల్లో సోదాలు చేసినట్లు వెల్లడించారు.
'అపరిచిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి' - పోలీసుల నిర్బంధ తనిఖీలు
ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మోండా మార్కెట్ ఎస్సై శంకర్ యాదవ్ తెలిపారు.
'అపరిచిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి'
సరైన ధ్రువపత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని... ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శంకర్ యాదవ్ వెల్లడించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..