Police Staff Effected by Corona: సరూర్‌నగర్ పీఎస్‌లో కరోనా కలకలం.. - పోలీసులపై కరోనా ప్రభావం

13:04 January 14
Police Staff Effected by Corona: ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా
Police Staff Effected by Corona: హైదరాబాద్లోని సరూర్‌నగర్ పీఎస్‌లో కరోనా కలకలం రేపింది. దేశంలో రోజు రోజుకు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. తెలంగాణలో కూడా కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పోలీసులు సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ.. కొవిడ్ పట్ల అవగాహన కల్పిస్తూ.. పోలీసులు కూడా వైరస్ బాధితులవుతున్నారు.
తాజాగా సరూర్‌నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో తొమ్మిది మంది సిబ్బందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారంతా క్వారంటైన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి.. మరో 2.64 లక్షల మందికి వైరస్