తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాభిపై దాడి చేసిందెవరు? ఆరోజు అసలేం జరిగింది?

తెదేపా నేత పట్టాభిపై దాడి కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. ఏ కారణంతో దాడి జరిగిందన్న విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు. తెదేపా నేతలు ఆరోపిస్తున్న రౌడీ షీటర్​.. ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. నిజంగా ప్రమేయం లేదా.. లేక ఇంట్లో ఉండి కథ నడిపించాడా అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.

By

Published : Feb 5, 2021, 8:19 AM IST

police-speed-up-investigation-in-attack-on-tdp-leader-pattabh
పట్టాభిపై దాడి కేసులో కొనసాగుతున్న విచారణ

తెదేపా నేత పట్టాభిపై దాడి కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసులో పురోగతి మాత్రం కనిపించటంలేదు. ఏ కారణంతో దాడి జరిగిందన్న విషయంలో పోలీసుల అంచనాకు రాలేకపోతున్నారు. కారణం తెలిస్తే దర్యాప్తులో చిక్కుముళ్లు త్వరగా వీడే అవకాశాలు ఉన్నాయని... పోలీసులు భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న రౌడీషీటర్లను క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. ఇందులో పాత నేరస్థుల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.

తెదేపా నేతలు ఆరోపిస్తున్న రౌడీషీటరు.. ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. నిజంగా ప్రమేయం లేదా లేక ఇంట్లో ఉండి కథ నడిపించాడా? అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు. ఇంకా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడికి కుట్ర విజయవాడలోనే జరిగిందని తెదేపా నేత బోడె ప్రసాద్‌ ఘటన జరిగిన రోజు అన్నారు. ఈ విషయంపైనా పోలీసులు దృష్టి సారించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల మోటివ్ ఏంటి అనే విషయంపై విశ్లేషణ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో కొంత పురోగతి సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:మమ్ముదాటి మీరు పోలేరులే.. ఇది నిజములే..!

ABOUT THE AUTHOR

...view details