gold seized in shamshabad airport: బంగారం అక్రమ తరలింపు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్‌ను చూసి స్మగ్లర్లు ఇలా రోజుకో కొత్త దారి వెతుకుతున్నారు. అందుకే గత కొద్ది కాలంగా దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. పుత్తడిని వివిధ రూపాల్లో చేసి మరీ అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు కూడా ప్రత్యేక నిఘా పెట్టి అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తున్నారు. బంగారానికి ఉన్న స్వభావం కారణంగా దానిని పేస్టుల రూపంలో, బిస్కెట్లుగా, షూస్ కింద, శరీర భాగాలో, తీగలుగా మార్చి విమానాల్లో తీసుకువస్తున్నారు.
స్వదేశీయుడే: కస్టమ్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి వారికి అందిన సమాచారంతో అత్యాధునికి టెక్నాలజీని ఉపయోగించి అక్రమార్కుల గుట్టును రట్టు చేస్తున్నారు. కోట్లు విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ గోల్డ్ స్మగ్లింగ్ కేసులు బయటపడుతున్నాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణీకులు నుంచి ఎక్కువగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు స్వదేశీయుడే అంతర్జాతీయ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని తీసుకుని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళుతున్న స్వదేశీ ప్రయాణికుడి నుంచి డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు 2031.35 బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.