Telangana Election Code Seizures :కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆదేశాలతో అధికార, పోలీసు యంత్రాంగం.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు చేపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీల్లో ప్రతి రోజూ కోట్ల కొద్దీ నగదు, మద్యం బాటిళ్లు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఈ రోడు వరకు.. 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
Telangana Assembly Elections 2023 :ఇందులో నిన్న ఒక్క రోజే ఉదయం నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం విలువ 12 కోట్లకు పైగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో బాలానగర్‌లో 10 లక్షలు, చైతన్యపురి ఎక్స్ రోడ్డులో 33.50 లక్షలు జప్తు చేశారు. కూకట్‌పల్లి పరిధి ప్రశాంత్‌నగర్, మూసాపేట్, భాగ్యనగర్ కాలనీల్లో సరైన పత్రాలు లేని 8 మంది వాహనదారుల నుంచి 21.69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 6.27 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. 31.36 లక్షల విలువైన మద్యం, 67.64 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి.. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు 20.43 కోట్ల రూపాయలు కాగా.. 86.92 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.