Police Officers Special Focus on Rowdy Sheeters During Elections : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొన్ని నేరాల్లో కనిపించకుండా పోయిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరికొంతమంది ఇంటికి నేరుగా వెళ్లి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొంతమంది పాత నేరస్థులు పోలీసులహెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి పలువురిని బెదిరిస్తున్నారనే సమాచారంతో వాళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని రౌడీషీటర్లపై డేగ కన్ను వేశారు.
నేతల ఫిర్యాదులపై ఈసీ నజర్-జోరుగా పోలీసుల బదిలీలు
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే అనుమానం ఉన్న వాళ్లను బైండోవర్ చేస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో దాదాపు 3500 మంది రౌడీషీటర్లు రికార్డుల్లో నమోదయ్యారు. వీరితో పాటు వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వాళ్లపైనాపోలీసులు నిఘా పెట్టారు. నగరం, శివారు ప్రాంతాల్లో ప్రైవేటు దందాలు, రియల్ వ్యాపారం, హోటళ్లు, హవాలా, హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్న ఏ-వన్ రౌడీషీటర్లు వెయ్యి మంది వరకు ఉన్నట్టు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది.
Police Officers Counselling to Rowdy Sheeters : లంగర్‌హౌజ్, ఆసిఫ్‌నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సెటిల్ మెంట్లు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల వివరాలు, కదలికలపై దృష్టిసారించి ఇన్స్‌పెక్టర్లు ప్రతినెలా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తిస్తే బైండోవర్ చేయాలి. రౌడీషీటర్ల విషయంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో బోరబండ ఇన్స్పెక్టర్‌ను సీపీ సందీప్ శాండిల్య బదిలీ చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్‌స్పెక్టర్లను ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రౌడీషీటర్ల బైండోవర్ వేగవంతం చేశారు. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ మండలాల పరిధిలో ఎక్కువమంది రౌడీషీటర్లు ఉన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఏసీపీ, డీపీసీ స్థాయి అధికారులు కౌన్సిలింగ్‌లో పాల్గొంటూ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొంతమందిని తహసీల్దార్, ఆర్డీవోల వద్ద హాజరుపరుస్తున్నారు.