తెలంగాణ

telangana

ETV Bharat / state

'3 నెలలకోసారి క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన గమనించండి'

మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై క్యాబ్​ సర్వీస్​ నిర్వాహకులతో... నగర పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తమ చరవాణులను డయల్​ 100కు అనుసంధానం చేసుకోవాలని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ ఆదేశించారు.

police-officers-meet-cab-drivers-in-hyderabad
మహిళల భద్రతపై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక చర్యలు

By

Published : Dec 5, 2019, 3:19 PM IST

మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యల మీద క్యాబ్‌ సర్వీసు నిర్వాహకులుతో... నగర పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. క్యాబ్‌ సేవలందించే నిర్వాహకులు తమ చరవాణులను డయల్‌ 100కు అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. వాహనాల్లో మహిళల భద్రతకు ఉన్న యాప్‌లను ప్రదర్శించాలని, ప్రతి రెండు మూడు రోజులకోసారి డ్రైవర్ల ప్రవర్తన, వినియోగదారుల అభిప్రాయాలను సేకరించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనీల్‌కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మహిళల భద్రతపై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక చర్యలు

ABOUT THE AUTHOR

...view details