తెలంగాణ

telangana

ETV Bharat / state

తెదేపా అధినేత చంద్రబాబుకు.. నోటీసులు - చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు.. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు నోటీసులు పంపారు. పుంగనూరుకు చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించి.. సాక్ష్యాధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

సాక్ష్యాధారాలు
సాక్ష్యాధారాలు

By

Published : Sep 1, 2020, 8:09 PM IST

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు.. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు నోటీసులు పంపారు. పుంగనూరుకు చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించి.. సాక్ష్యాధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నుంచి చంద్రబాబుకు సీఆర్​పీసీ 91 కింద ఈ నోటీసు జారీ చేశారు.

గతంలో.. ఓం ప్రతాప్ మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారన్న పోలీసులు... ఆగస్ట్ 27 న దినపత్రికల్లో వచ్చిన కథనాన్నినోటీసులో ప్రస్తావించారు. వారం రోజుల్లోపు తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details