తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస ఎమ్మెల్యేల ఎర'.. నిందితులకు సీఆర్​పీసీ 41 నోటీసులు - సీఆర్​పీసీ సెక్షన్​41

Telangana Police issued notice: 'తెరాస ఎమ్మెల్యేలకు ఎర' సరైనా ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్​ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించి, వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు. 41 సీఆర్​పీసీ కింద నోటీసులు ఇచ్చిన తరవాతనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే నిందితులకు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులకు సూచించారు. అసలేప్పుడు ఈ నోటీసులు జారీ చేశారో తెలుసుకుందాం?

telangana politics
ఎమ్మెల్యేల ఎర

By

Published : Oct 28, 2022, 12:58 PM IST

Telangana Police issued notices CRPC section: 'తెరాస ఎమ్మెల్యేలకు ఎర' నిందితులకు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లకు మొయినాబాద్‌ పోలీసులు సూచించారు. గురువారం రాత్రే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గురువారం నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.

భాజపాలో చేరాలంటూ తెరాసకు చెందిన తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్‌, పినపాక ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అసలేం జరిగింది..‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితులను రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గురువారం రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ నివాసానికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితుల్ని విడిచిపెట్టామని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఇలా ఉన్నాయి. దిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ సెప్టెంబరు 26న తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిశారు. తెరాసకు రాజీనామా చేసి వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేస్తే.. రూ.100 కోట్ల నగదు, కేంద్రప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఆశపెట్టారు. కేంద్రప్రభుత్వంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తామన్నారు. భాజపాలో చేరకపోతే ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి, క్రిమినల్‌ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు.

భారీమొత్తంలో లంచమివ్వజూపిన ఈ అనైతిక చర్యను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రోహిత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై 120-బి (నేరపూరిత కుట్ర), 171-బి రెడ్‌విత్‌ 171-ఈ 506 (నేరపూరిత బెదిరింపు) రెడ్‌విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌-1988 (ప్రభుత్వ ప్రతినిధికి లంచమివ్వజూపడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

భారీమొత్తంలో లంచమివ్వజూపిన ఈ అనైతిక చర్యను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రోహిత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై 120-బి (నేరపూరిత కుట్ర), 171-బి రెడ్‌విత్‌ 171-ఈ 506 (నేరపూరిత బెదిరింపు) రెడ్‌విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌-1988 (ప్రభుత్వ ప్రతినిధికి లంచమివ్వజూపడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details