తెలంగాణ

telangana

ETV Bharat / state

జయరాం హత్యకేసులో సస్పెండైన అధికారులకు ఎదురుదెబ్బ

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. శాఖా పరమైన విచారణ, కోర్టులో జరిగే విచారణ రెండూ వేరని హైకోర్టు స్పష్టం చేసింది.

జయరాం హత్యకేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

By

Published : Oct 30, 2019, 3:03 PM IST

Updated : Oct 30, 2019, 3:17 PM IST

తమపై శాఖపరమైన విచారణ నిలిపివేయాలని కోరుతూ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. జయరాం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిందితులకు సహకరించారనే అభియోగాలపైసస్పెండయిన ఏసీపీ ఎస్.మల్లారెడ్డి, ఇన్​స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబు దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

నాంపల్లి కోర్టులో తమపై అభియోగపత్రం దాఖలయిందని.. కోర్టులో విచారణ ప్రక్రియ కొనసాగుతుండగా... అవే ఆరోపణలపై శాఖపరమైన విచారణ చేపట్టడం సరికాదని వాదించారు. శాఖపరమైన విచారణలో తమ వాదన బహిర్గతమైతే.. కోర్టు విచారణలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

అయితే నేరాభియోగాలపై కోర్టులో విచారణ... ఉద్యోగిగా దుష్ప్రవర్తన ఆరోపణలపై జరిగే శాఖా పరమైన విచారణ వేర్వేరని హైకోర్టు స్పష్టం చేసింది. ముగ్గురి పిటిషన్​ను తోసిపుచ్చింది.

జయరాం హత్యకేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

ఇదీ చూడండి:ఈ చెత్త నుంచి విముక్తి కలిగించరా...!

Last Updated : Oct 30, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details