Heavy police bandobast at old city : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో..... హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా చార్మినార్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టియర్ గ్యాస్‌తో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న అసద్ కారుపై.... ఇద్దరు దుండగులు గురువారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Asaduddin Owaisi vehicle attack : ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గొడవలు తలెత్తే అవకాశం ఉన్నందున... పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. చార్మినార్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల పహారా పెంచారు. చార్మినార్, లాడ్ బజార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ దుకాణాలు తెరుచుకోలేదు.