Shilpa Chowdary Police Custody: శిల్పాచౌదరి కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల కస్టడీ ముగియడం వల్ల పోలీసులు రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. శిల్పాచౌదరి నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఆమె ఖాతాలో రూ.16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14వేలను పోలీసులు గుర్తించారు. శిల్ప ఇప్పటివరకు కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Shilpa Chowdary Police Custody: రూ.7కోట్లు తిరిగిచ్చేస్తా.. పోలీసుల విచారణలో శిల్పా చౌదరి - ముగిసిన శిల్పాచౌదరి కస్టడీ వార్తలు
Shilpa Chowdary Police Custody: మూడ్రోజుల కస్టడీ ముగియడం వల్ల శిల్పాచౌదరిని రేపు ఉదయం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు.
మూడు కేసుల్లో రూ. 7 కోట్ల మోసం చేసినట్టు శిల్పపై బాధితులు ఫిర్యాదు చేశారు. ముగ్గురికి కూడా రూ. 7 కోట్లను తిరిగిచ్చేస్తానని శిల్పాచౌదరి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల నుంచి శిల్ప రూ. 7 కోట్లకుపైగా తీసుకొని ఎగవేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో శిల్ప పనిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె అమెరికా నుంచి భారత్‌కు వచ్చి మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10 కోట్లకుపైగా డబ్బులు ఇచ్చినట్టు శిల్ప చెప్పినప్పటికీ తగిన ఆధారాలు ఇవ్వలేదు. శిల్పాచౌదరి మోసాలపై మరిన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.