తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనవసరంగా రోడ్ల మీద తిరిగితే కేసులే'

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు. రోడ్ల మీద అనవసరంగా తిరిగే వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు.

police-checking-ay-secundrabad
'అనవసరంగా రోడ్ల మీద తిరిగితే కేసులే'

By

Published : Apr 22, 2020, 11:39 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు​ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు నార్త్​ జోన్ ట్రాఫిక్ ఏసీపీ రంగయ్య ఆధ్వర్యంలో గోపాలపురం, మహంకాళి ట్రాఫిక్ పోలీసులు సంగీత్, ప్యాట్ని, ప్యారడైస్ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎలాంటి కారణం లేకుండా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ.. ఇంట్లోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details