తెలంగాణ

telangana

ETV Bharat / state

వాహనదారులపై పోలీసుల ఆగ్రహం..వాహనాలు స్వాధీనం

ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తున్నారు.

police checking at koti
అకారణాలతో రోడ్లపైకి... పలు వాహనాలు సీజ్koti

By

Published : Apr 8, 2020, 5:05 PM IST

ట్యాంక్​బండ్​పై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రోడ్లపైకి వచ్చి పొంతన లేని సమాధానాలు చెప్పిన వాహనదారులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అకారణాలతో రోడ్లపైకి... పలు వాహనాలు సీజ్

అసహనానికి గురైన పోలీసులు వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరించారు. జరిమానాలు విధించి, వాహనాలను సీజ్ చేశారు. రోడ్లపై తిరుగుతున్న ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులకు పలు సూచనలు చేశారు. తప్పని పరిస్థితి అయితేనే బయటకు రావాలని... లేనిపక్షంలో కేసు పెట్టి జైళ్లకు పంపిస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:లాక్​డౌన్​ ముగిశాక 'వుహాన్​' ప్రజలు ఏం చేస్తున్నారు?

ABOUT THE AUTHOR

...view details