Police Caught Huge Hawala Cash in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వాహనాలు, అధిక మొత్తంలో నగదును పట్టుకువెళ్లే వ్యక్తులపై నిఘా పెట్టారు. సోమవారం నుంచే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నగదును పట్టుకెళ్తున్న వ్యక్తులను, వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారు.
Police Seized Money in Hyderabad : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలోని నలుగురు వ్యక్తుల నుంచి భారీ హవాలా మనీ(Hawala Money)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3.35 కోట్ల నగదును బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్(North Zone Task Force)తో కలిసి బంజారాహిల్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కియా కారును తనిఖీ చేయగా..: ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 3 వద్ద వాహనాలు తనిఖీ చేశారు. పోలీసులకి అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేశారు. కారులో రూ.3.35 కోట్ల నగదుని గుర్తించారు. ఈ మొత్తాన్ని హవాలా మనీగా నిర్ధారించుకుని.. డబ్బుతో పాటు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చింపిరెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాముల రెడ్డి, ఉదయ్ కుమార్‌లుగా గుర్తించారు. ఇందులో ప్రధాన సూత్రధారి చింపిరెడ్డి అని తేలింది.
Huge Hawala Cash Case Details : ప్రధాన నిందితుడు సూచనల మేరకు మిగిలి ముగ్గురు నిందితులు హవాలా మనీ సేకరిస్తారని డీసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ వివిధ ప్రాంతాల్లో డబ్బులను తరలిస్తారని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని అరోరా కాలనీలోని సాయి కృప బిల్డింగ్‌లో ప్లాట్ నంబర్ 583ని తమ కార్యాలయంగా మార్చుకుని ఈ దందా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.