Case Registered Against Kodangal MLA in Banjarahills PS : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భూమి కొనుగోలు విషయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2018లో రాజేంద్రనగర్ ఉప్పరపల్లికి చెందిన బాధితుడు ఇంద్రపాల్ రెడి.. ఉప్పరపల్లిలోని స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో మధ్యవర్తుల రూపంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాకేశ్‌రెడ్డిలు ఆయనకు పరిచయం అయ్యారు.
Kodangal MLA Narender Reddy Latest News : తమకు తెలిసిన భూస్వాములు ఉన్నారని.. వీరిద్దరూ కలిసి శ్రీరామ్‌రెడ్డి అనే మరో వ్యక్తిని ఇంద్రాపాల్‌కు పరిచయం చేశారు. స్థలం, తమ కమీషన్‌తో కలిపి రూ.3.65 కోట్లకు భూమి అమ్ముతామన్నారు. ఇంద్రపాల్ ఇందుకు ఒప్పుకున్నాడు. ఈ మేరకు 2018 మే 24న రూ. 90 లక్షలు చెల్లించాడు. సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే, రాకేశ్‌రెడ్డిలు బాధితుడి వద్ద బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు. విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లను భూ యజమానులకు, ఎమ్మెల్యే, రాకేశ్‌రెడ్డిలకు ఇంద్రపాల్ చెల్లించాడు. మరో రూ.60 లక్షలు లోన్ రాగానే చెల్లిస్తానని తెలిపాడు. రుణం మంజూరు కాకపోవడంతో.. డబ్బులు ఇచ్చేందుకు ఆలస్యం అయింది. దీంతో అప్పటి నుంచి తనను బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.