తెలంగాణ

telangana

ETV Bharat / state

తుకారాం గేట్​ పరిధిలో నిర్బంధ తనిఖీలు - తుకారాం గేట్​ పోలీస్​ స్టేషన్​

ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. తుకారాం గేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చంద్రశేఖర్​ నగర్​ బస్తీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీలు

By

Published : Aug 1, 2019, 11:48 AM IST

హైదరాబాద్​ తుకారాం గేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అడ్డగుట్ట ఆజాద్​ చంద్రశేఖర్​ నగర్​ బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోదాల్లో దాదాపు 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తుకారాం గేట్​ సీఐ అశోక్​ కుమార్​ అన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

తుకారాం గేట్​ పరిధిలో నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details