POLICE BATON CHARGE ON TDP ACTIVISTS :ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేంఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు వస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నేతలు శాంతిపురం చేరుకుంటున్నారు.
చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు.. తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ - CHARGE ON TDP ACTIVISTS
ఏపీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచార రథం, ఇతర వాహనాలను నిలిపివేశారు. ఈ మేరకు శాంతిపురం వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఎస్.గొల్లపల్లి వద్ద టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
అయితే ఎక్కడికక్కడ పోలీసులు తమ ఆంక్షలతో వారిని అడ్డుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన మార్గాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్.గొల్లపల్లి వద్ద కూడా ఇలాగే అడ్డుకోవడంతో పోలీసులు-తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో మహిళా కార్యకర్తలతో పాటు 10 మందికి గాయాలయ్యాయి. లాఠీఛార్జ్, తోపులాటలో తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ స్పృహ తప్పి కిందపడియారు.
ఇవీ చదవండి:
TAGGED:
kuppam tension