accused arrested in 7 crore worth gold in Hyderabad :హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రూ.7 కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాలో ఏపీ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ తీసుకువచ్చిన తర్వాత శ్రీనివాస్‌ను విచారించనున్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు చెప్పారు. చివరకు నాలుగు రోజుల తర్వాత ఇవాళ ఎట్టకేలకు చిక్కాడని వివరించారు.
అసలు ఏం జరిగిందంటే : మాదాపూర్ చెందిన రాధిక నగల దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని బంగారం, వజ్రాభరణాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తారు. వినియోగదారులకు నచ్చితే నేరుగా వారి ఇంటి దగ్గరకే డెలివరీ చేస్తారు. ఈ క్రమంలో అనూష అనే ఓ మహిళ రాధిక వద్ద రూ.50లక్షలు విలువ చేసే వజ్రాభరణాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది.