తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్​ 4న పీఓ, ఏపీఓలకు ఎన్నికల తుదివిడత శిక్షణ - ఎన్నికల శిక్షణ

తొలివిడత ఎన్నికల నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన ఉద్యోగులకు తుదివిడతగా ఏప్రిల్​ 4న శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. పీఓ, ఏపీఓలు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్​ తెలిపారు.

ఎన్నికల శిక్షణ

By

Published : Apr 3, 2019, 5:49 AM IST

గైర్హాజరైన ఉద్యోగులకు ఏప్రిల 4న శిక్షణ
లోక్‌స‌భ ఎన్నిక‌ల నిర్వహ‌ణ శిక్షణ‌కు గైర్హాజ‌రైన ప్రిసైడింగ్ అధికారులు, స‌హాయ ప్రిసైడింగ్ అధికారుల‌కు తుది విడ‌తగా ఏప్రిల్ 4న శిక్షణ‌ నిర్వహిస్తున్నట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. సికింద్రాబాద్​ హరిహర కళాభవన్​లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే అధికారులు, ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దానకిషోర్​ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details