తెలంగాణ

telangana

ETV Bharat / state

పన్ను వసూళ్లు పెరిగాయ్ : పీయూష్ గోయల్

పన్నుల వసూళ్లు పెరిగాయని బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

PIYUSH

By

Published : Feb 1, 2019, 4:10 PM IST

ఐదేళ్ల పాలన ముగుస్తున్న సమయంలో...లోక్​సభ ఎన్నికలే లక్ష్యంగా ఎన్డీఏ తాత్కలిక బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాన్ని రూ. 27, 84, 200 కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. పన్నుల పరిమితులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లలపై మాట్లాడారు. ప్రస్తుత ఏడాదిలో నెలకు రూ. 97,100 కోట్ల పన్నులు వసూళ్లవుతున్నాయని మంత్రి తెలిపారు. గత అయిదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు 14 శాతం పెరిగాయని వెల్లడించారు. ఎగవేతదారులపై తీసుకొంటున్న చర్యలతో రూ. లక్ష కోట్లకు పైగా లెక్కలోకి వచ్చాయన్నారు. 2017-18లో కోటి 6 లక్షల మంది ఐటీ రిటర్న్స్​దాఖలు చేశారని.. ఈ రిటర్న్ 94.54 శాతం యథావిధిగా ఆమోదించామని పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే రెండేళ్లలో పన్ను రిటర్న్​ల విధానాన్ని ఎలక్ట్రానిక్​గా మారుస్తామన్నారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 6 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details