ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు, సీఆర్‌డీఏ బిల్లుల రద్దు వ్యవహారంపై తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) స్పందించిందని హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొ.జి.వి.ఆర్.శాస్త్రి వెల్లడించారు. ఈ బిల్లులపై తనను పీఎంఓ వివరాలు కోరినట్లు తెలిపారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా దృష్టికి 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ బిల్లుల రద్దు వ్యవహారాన్ని ఇటీవల తీసుకెళ్లాను. బిల్లుల రద్దుపై గవర్నర్ ఆమోదం తెలపకుండా చూడాలని లేఖ ద్వారా కోరాను. దీనిపై స్పందించిన ప్రధాని కార్యాలయం సీనియర్ అధికారులు... వివరాలు కావాలని నన్ను కోరారు. గవర్నర్ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పీఎంఓకు పంపించాను- ప్రొ.జి.వి.ఆర్.శాస్త్రి