తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చిన పీఎంవో - ప్రధాన మంత్రి మోదీ తాజా వార్తలు

ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్​కు​ వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది పీఎంవో. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారమిచ్చింది.

pmo gave permission to only five members to welcome to prime minister  modi
ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చిన పీఎంవో

By

Published : Nov 28, 2020, 5:23 AM IST

హైదరాబాద్​కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ఐదుగురు అధికారులు మాత్రమే స్వాగతం పలకనున్నారు. హకీంపేట విమానాశ్రయంలో.. ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ జాబితాలో ఉన్నారు. సహజంగా ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు.. విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు.. స్వాగతం పలుకుతారు.

అదే సంప్రదాయం ప్రకారం స్వాగతం పలకాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ భావించారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్‌ అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. దీనికి స్పందనగా తెలంగాణ ప్రభుత్వానికి.. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందించిన పీఎంవో.. ప్రధానికి స్వాగతం చెప్పేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి వ్యక్తిగత సహాయకుడు.. వివేక్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు.. ఫోన్ చేసి చెప్పారు. జాబితాలో ఉన్న అధికారులు మాత్రమే విమానాశ్రయానికి రావాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ప్రసంగాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details