రైతులకు పెట్టుబడులను అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకం వెబ్‌సైట్‌లోని భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే చూపుతున్నారంటూ ‘ఈటీవీ భారత్, ఈనాడు’లో ‘పీఎం కిసాన్‌లో తెలంగాణ ఏదీ?’ శీర్షికన ప్రచురితమైన వార్త కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల్లో కదలిక తెచ్చింది.
ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు
ఈటీవీ భారత్, ఈనాడులో ప్రచురితమైన కథనం కేంద్ర, రాష్ట్ర వ్యవశాయ శాఖల్లో కదలిక తెచ్చింది. పీఎం కిసాన్ పథకం వెబ్సైట్లో తెలంగాణను ప్రత్యేకంగా సూచించకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే చూపుతున్నారంటూ... ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వెబ్‌సైట్‌లోని భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించింది.
pm kisan scheme identified telangana
ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి బుధవారం ఉదయమే కేంద్ర వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వెబ్‌సైట్‌లోని భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించడమే కాకుండా పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిపొందిన రాష్ట్ర రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో చూపించింది.