తెలంగాణ

telangana

ETV Bharat / state

డొనేషన్‌ కట్టలేదని చెప్పండి ప్లీజ్‌.. తల్లిదండ్రులకు కాలేజీల నుంచి ఫోన్లు - దర్యాప్తు సంస్థల సోదాలు

రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల దాడులు రాజకీయ కాక రేపుతున్నాయి. రాష్ట్రం, కేంద్రానికి చెందిన దర్యాప్తు సంస్థల సోదాలు ఎవరిపై ఎప్పుడు జరుగుతాయోననే ఉత్కంఠ నెలకొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర మంత్రులపై గురి పెట్టాయి. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కళాశాలలు, ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. కళాశాలల్లో డొనేషన్లపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల యాజమాన్యాలు డొనేషన్‌ తీసుకున్న విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

Precautions in the Face of IT attacks
Precautions in the Face of IT attacks

By

Published : Nov 24, 2022, 10:51 AM IST

శంషాబాద్‌ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి బుధవారం ఓ విద్యార్థిని తండ్రికి ఫోన్‌ వచ్చింది. ‘మీ పాప మా కళాశాలలో చదువుతోంది కదా. ఎవరైనా బయటి వ్యక్తులు ఫోన్‌ చేసి కళాశాలకు డొనేషన్‌ కట్టారా అని అడిగితే.. చెల్లించామని చెప్పకండి. మీకు, మాకు ఇబ్బంది లేకుండా చూసుకోండి’ అని కళాశాల ప్రతినిధి చెప్పారు. ఎందుకని ఆరా తీస్తే.. ఐటీ దాడుల నేపథ్యంలో తల్లిదండ్రులందరికీ ఫోన్లు చేస్తున్నట్లు ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు.

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కళాశాలలు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. కళాశాలల్లో డొనేషన్లపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల యాజమాన్యాలు.. తాము డొనేషన్‌ తీసుకున్న విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

లెక్కలోకి రాకుండా.. రూ.లక్షల్లో వసూలు:నగర శివారులోని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రవేశాల కోసం ఏకంగా రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేశాయి. కళాశాల స్థాయి, బ్రాంచిని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలలు బీటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.12-15 లక్షలు వసూలు చేశాయి. మిగిలిన ఫీజులన్నీ దీనికి అదనం. ఒకే దఫాగా నగదు రూపంలో వసూలు చేసిన డొనేషన్‌ మొత్తాలకు పక్కా రసీదులివ్వరు. ఇవన్నీ కళాశాలల లెక్కల్లో కనిపించవు. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details