తెలంగాణ

telangana

ETV Bharat / state

'దయచేసి చర్చలకు పిలవండి.. మేము సిద్ధంగా ఉన్నాం' - దయచేసి చర్చలకు పిలవండి మేము సిద్ధంగా ఉన్నాం

''దయచేసి చర్చలకు పిలవండి మేము సిద్ధంగా ఉన్నాం.. 26 డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. ఇబ్బందిగా ఉన్న అంశాలను వదులుకునేందుకు రెడీగా ఉన్నాం. షరతులు లేని చేరికలను ఆర్టీసీ కార్మికులు అంగీకరించడం లేదు. చర్చలుకు పిలిస్తే ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికులు.. ప్రజలు ఒక్కటే. మాతో ఏ ట్రేడ్​ యూనియన్లు, రాజకీయ పార్టీలు ఉండవు'' - ఆర్టీసీ జేఏసీ నేతలు.

'దయచేసి చర్చలకు పిలవండి.. మేము సిద్ధంగా ఉన్నాం'

By

Published : Nov 5, 2019, 6:57 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల మరణాలు, దాదాపు నెలరోజులగా వారు చేపడుతున్న నిరసన పరిణామాలను ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికే దిశగా చర్చలకు పిలవాలని ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. 26 డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఇబ్బందిగా ఉన్న అంశాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు తెలిపారు. షరతులులేని చేరికలను ఆర్టీసీ కార్మికులు అంగీకరించడం లేదన్నారు.


గడువు ముగియనుంది:

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఇచ్చిన అవకాశం నేటితో ముగిసియనున్న నేపథ్యంలో నిన్న ఆర్టీసీ జేఏసీ నేతలు వేర్వేరుగా యూనియన్ల వారీగా సుధీర్ఘ సమావేశాలు నిర్వహించాయి. కార్మికులు సమ్మెపై ఏమనుకుంటున్నారని డిపోలవారీగా సమాచారం సేకరించాయి. కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని నివృత్తి చేశారు.

మాతో ఏ రాజకీయ పార్టీలూ లేవు

మొక్కవోని అకుంఠిత పోరాటపటిమతో సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు జేఏసీ నేతలు పాదాభివందనం చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్ లైన్ విధించినా.. 11మంది మాత్రమే విధుల్లో చేరారని.. ఆ చేరిన వాళ్లలో తిరిగి ఐదుగురు వెనక్కి వచ్చి సమ్మెలో పాల్గొంటున్నారని జేఏసీ నేతలు తెలిపారు. తమవెంట ఏరాజకీయ పార్టీలు లేవని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.


ప్రభుత్వం చర్చలకు పిలిస్తే.. ప్రభుత్వం, ప్రజలు, ఆర్టీసీ కార్మికులు ఒక్కటే అని.. ఇతర రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు తమ వెంబడి ఉండవని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇవాళ అన్ని డిపోల వద్ద మానవహారం చేస్తామన్నారు. నిన్న11గంటలకు రాజకీయ పార్టీ నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించమన్నారు.

రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్యాచరణ
⦁ ఇవాళ అన్ని డిపోల ముందు మానవహారం
⦁ 6న అన్ని డిపోల ముందు కుటుంబసభ్యులతో భైఠాయింపు,
⦁ 7వ తేదీన ప్రజా సంఘాల ప్రదర్శన.
⦁ 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక సమావేశం.
⦁ 9వ తేదీన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

'దయచేసి చర్చలకు పిలవండి.. మేము సిద్ధంగా ఉన్నాం'

ఇదీ చూడండి: గడువు లోపు చేరకుంటే... ఉద్యోగం పోయినట్లే : ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details