సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిత్యం 1.80 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వీరికి వీడ్కోలు పలికేందుకు మరో 50 వేల మంది వరకు వస్తుంటారని దక్షిణ మధ్య రైల్వే రైల్వేశాఖ లెక్కలు వేసింది. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ సునాయసంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెంచారు అధికారులు నిర్ణయించారు.
కరోనా ఎఫెక్ట్: ఫ్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
ప్రయాణికులతో పాటు వచ్చే వారి రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫాం టికెట్ ధరను రూ.50కు పెంచాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర పెంచితే ప్రయాణికులతో పాటు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్: ఫ్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
ప్రస్తుతం ఫ్లాట్ ఫారం టికెట్ ధర రూ.10 ఉంది. రూ.50కు పెంచితే వీడ్కోలు పలికేందుకు వచ్చే వారిని నిరోధించే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 84 రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.50కి, మరో 499 రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20 కి పెంచినట్లు అధికారులు వివరించారు. పెంచిన ధరలు ఈ రోజు తెల్లవారు నుంచి మార్చి 31 వరకు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
Last Updated : Mar 17, 2020, 11:25 PM IST