తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ రహితంగా అసెంబ్లీ.. ప్రకటించిన స్పీకర్​ - ప్లాస్టిక్​ రహితంగా అసెంబ్లీ.. ప్రకటించిన స్పీకర్​

శాసనసభ ప్రాంగణం, పరిసరాలను ప్లాస్టిక్ రహితంగా ప్రకటించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగిన వన్యప్రాణి, పర్యావరణ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీని ప్లాస్టిక్ ఫ్రీ జోన్​గా ప్రకటిస్తున్నామన్న స్పీకర్... ఇకపై ప్రాంగణం, పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిల్స్, వస్తువులను వాడబోమని స్పష్టం చేశారు. పర్యావరణహితమైన వస్తువులను మాత్రమే వాడతామని ప్రకటించారు.

ప్లాస్టిక్​ రహితంగా అసెంబ్లీ.. ప్రకటించిన స్పీకర్​

By

Published : Nov 18, 2019, 7:18 PM IST

ప్లాస్టిక్​ రహితంగా అసెంబ్లీ.. ప్రకటించిన స్పీకర్​

అసెంబ్లీని ప్లాస్టిక్​ రహిత జోన్​గా ప్రకటించారు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి. స్పీకర్​ అధ్యక్షతన జరిగిన వన్యప్రాణి, పర్యావరణ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీని ప్లాస్టిక్ ఫ్రీ జోన్​గా ప్రకటిస్తున్నామన్న స్పీకర్... ఇకపై ప్రాంగణం, పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిల్స్, వస్తువులను వాడరాదని స్పష్టం చేశారు. పర్యావరణహితమైన వస్తువులను మాత్రమే వాడామని ప్రకటించారు.

మట్టి కుండలు, గ్లాసులు సిద్ధం

సమావేశంలో మట్టితో తయారు చేసిన కుండలు, గ్లాసులు ప్రవేశపెట్టారు. ఇప్పటి నుంచే ఇందుకు శ్రీకారం చుడుతున్నట్లు సభాపతి పోచారం ప్రకటించారు. రాష్ట్రంలో అడవుల రక్షణ, హరితహారం అమలు, పర్యావరణహిత చర్యలపై సమావేశంలో చర్చించారు.

గ్రీన్ ఛాలెంజ్​కు ప్రశంసలు

గ్రీన్ ఛాలెంజ్​ను విజయవంతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్​కు కమిటీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. హరితహారం నిర్వహణకు గ్రీన్ ఛాలెంజ్ అదనపు ఆకర్షణగా నిలిచిందని... సంతోష్ కృషి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి:భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details