తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈడీ కేసును కొట్టివేయాలని హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్‌ - ఈడీపై రోహిత్‌రెడ్డి కామెంట్స్

Pilot Rohit Reddy writ petition in the TS High Court
హైకోర్టులో పైలట్‌ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్

By

Published : Dec 27, 2022, 4:14 PM IST

Updated : Dec 27, 2022, 4:42 PM IST

16:10 December 27

హైకోర్టులో పైలట్‌ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్

Rohit Reddy writ petition ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టును కోరారు. కోర్టులో విచారణ ముగిసే వరకు కేసు విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. మనీలాండరింగ్ కేసులో నోటీసులు ఇచ్చి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలను గుచ్చి గుచ్చి అడిగి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు... మనీలాండరింగ్‌తో సంబంధమేం లేదని స్పష్టం చేశారు.

దర్యాప్తు అధికారి మొబైల్ ఫోన్‌కు వస్తున్న వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా తనను వివరాలు అడుగుతున్నారని.. తాను చెప్పిన వివరాలు మాత్రం సరిగా నమోదు చేయడం లేదని ఆరోపించారు. తాజాగా బంజారాహిల్స్‌లో నమోదైన ఓ కేసులో నందకుమార్‌ను ఈడీ ప్రశ్నిస్తోందన్నారు. తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని దాని ఆధారంగా తనను ఇరికించే కుట్ర జరుగుతోందని పిటిషన్లో పైలట్ రోహిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈడీ ఈసీఐఆర్‌ను కొట్టివేయాలని.. అప్పటి వరకు కేసుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఈడీ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2022, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details