ఒక్క నిమిషం నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం - inter exams in telangana
21:30 March 10
inter exams
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతివ్వరాదన్న నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇంటర్ బోర్డు నిబంధనను కొట్టివేయాలని కోరుతూ న్యాయవాది భాస్కర్ పిల్ దాఖలు చేశారు. విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పటికీ... పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఆలస్యం ఎందుకు జరుగుతుందో కారణాలు తెలుసుకుని... విద్యార్థులకు అవగాహన కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. విద్యార్థులను పరీక్షకు అనుమతివ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కంట్రోలర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వ్యాజ్యంపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.